AP: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా ఒకేసారి రెండే డీఏ బకాయిలను బాబు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వేతన సవరణ సంఘం పీఆర్సీ, మధ్యంతర భృతి ఐఆర్‌లపై కూడా చంద్రబాబు ఉద్యోగ వర్గాలతో సానుకూలంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం. మంత్రి వర్గ సమావేశంలో చంద్రబాబు వీటి మీద కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.