AP: ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. 2026 ఫిబ్రవరి 28 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నెల 30న విజయానంద్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా, ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీంతో డిసెంబర్ 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఉత్తర్వులు జారీ చేసింది.