AP: తగ్గనున్న కరెంట్‌ బిల్లు ఛార్జీలు

AP: రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు శుభవార్త అందించింది. విద్యుత్ నియంత్రణ మండలి (APERC) ‘ట్రూడౌన్’ ప్రక్రియ ద్వారా కరెంట్ బిల్లుల్లో ఛార్జీల రాయితీకి ఆమోదం తెలిపింది. దీనివల్ల గత రెండేళ్లలో కలిపి దాదాపు రూ. 1,553 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులందరికీ ఇది ఆర్థిక ఉపశమనాన్నిస్తుంది. విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడం, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ పాటించడమే ఈ భారీ తగ్గింపునకు కారణం.

సంబంధిత పోస్ట్

✕
✕