ఇవాళ AP EAPCET ఫలితాలు విడుదల

AP: ఈఏపీసెట్‌ ఫలితాలను మంగళవారం విడుదల చేయడానికి విద్యా శాఖ సిద్ధమైంది. ప్రవేశ పరీక్ష కమిటీ సమావేశం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. సీబీఎస్ఈ రీవాల్యూయేషన్‌ రెండో విడత ఫలితాలను పక్కనపెట్టి ఈఏపీసెట్‌ ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దీని వలన కొందరు విద్యార్థులకు అన్యాయం జరిగేలా విద్యాశాఖ చర్యలు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్