పంటలకు పరిహారం ప్రకటించిన ఏపీ సర్కార్‌

AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. పత్తి, గోధుమ పంటలకు ఎకరాకు రూ.25 వేలు, వరి పంటకు ఎకరాకు రూ.20 వేలు, చెరుకు పంటకు ఎకరాకు రూ.25 వేలు, సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శెనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడుకు రూ.15 వేలు, అరటి, పసుపు, మామిడి, జీడిమామిడితో పాటు కాఫీ, డ్రాగన్ ఫ్రూట్‌కు ఎకరాకు రూ.35 వేలు, కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్‌కు రూ.25 వేలు, తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేలు, కొబ్బరి, పామాయిల్ ఒక్కో చెట్టుకు రూ.15 వేల చొప్పున పరిహారం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్

✕
✕