శ్రేయ గ్రూప్‌ సంస్థ ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

కర్నూలు జిల్లాలో శ్రేయ ఇన్‌ఫ్రా మార్కెటింగ్‌ సంస్థ ప్రజలను మోసం చేసిన కేసులో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అధిక వడ్డీ ఆశ చూపి, 8,128 మంది డిపాజిటర్ల నుంచి రూ.206 కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలున్నాయి. బాధితుల ఫిర్యాదుతో సీఐడీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రేయ గ్రూప్‌, హేమంత్‌ రాయ్‌, సంగీతా రాయ్‌ల పేర్లతో ఉన్న ఆస్తులను, ముఖ్యంగా జూపాడుబంగ్లా మండలం పారుమంచాలలోని 51.55 ఎకరాలను జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది.

సంబంధిత పోస్ట్