సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం

AP: అమరావతిలో సచివాలయ ఉద్యోగుల ఆందోళనలపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆందోళనల్లో కీలకంగా వ్యవహరించిన 45 మంది ఉద్యోగులను పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వారిపై సస్పెన్షన్‌ వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే 45 మందిపై కేసులు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕