11 జిల్లాలకు రూ.14 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం (VIDEO)

AP: రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదల ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తక్షణ సాయంగా 11 జిల్లాలకు రూ.14 కోట్లు విడుదల చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలు, అధిక వర్షపాతం నమోదైన మండలాల్లో ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు, ఇతర అత్యవసర సదుపాయాల కోసం ఈ నిధులను వినియోగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకుని అవసరమైన సహాయాన్ని అందించాలని సూచనలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్