ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మామిడి రైతుల సౌకర్యార్థం నూజివీడు మార్కెట్ యార్డ్‌లో వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.30 కోట్లు మంజూరు చేశామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. నూజివీడు మామిడికి మరింత ఇమేజ్ చేకూర్చి రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నూజివీడు మామిడిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన ఎయిర్ కార్గో సేవలను కూడా రైతులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.