ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎయిర్‌పోర్టుల్లోనూ మద్యం అమ్మకాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి మినహా రాష్ట్రంలోని ఇతర విమానాశ్రయాల్లో 24 గంటల పాటు బార్లు, లిక్కర్ షాపులు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వంటి ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. వార్షికంగా 20 లక్షలకుపైగా ప్రయాణికులు ఉండే విమానాశ్రయాలకు రూ.25 లక్షలు, తక్కువ రద్దీ ఉన్న వాటికి రూ.15 లక్షల లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, పర్యాటక రంగానికి ఊతమివ్వడమే ఈ నిర్ణయం ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్