AP: విశాఖపట్టణంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వంతో కియా ఇండియా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అనంతపురంలో రెండో తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు కియా మోటార్స్, దాని భాగస్వాములు సుమారు 2 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 17,000-18,750 కోట్లు) భారీ పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్లాంటు ద్వారా ఏటా మరో 2 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది. దీనివల్ల సుమారు 12,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. 2030 నాటికి ఉత్పత్తి ప్రారంభం కానుంది.