AP: ఉచిత విద్యుత్ అమలుకు గ్రీన్ సిగ్నల్

AP: రాష్ట్రంలో చేనేతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం నుంచే ఉచిత విద్యుత్ అమలుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనుంది. నేతన్నల ఉచిత విద్యుత్‌కు రూ.125కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం కేటాయించింది. దీని ద్వారా 50వేల మగ్గాలు, 15వేల మర మగ్గాలు కలిగిన కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందుగానే ఉచిత విద్యుత్ అమలుకు సీఎం పచ్చజెండా ఊపారు.

సంబంధిత పోస్ట్