ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై స్టే విధించిన ఏపీ హైకోర్టు

AP: ఆక్వా ఫీడ్‌ ధరల పెంపుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఫీడ్‌ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడాన్ని సవాల్‌ చేస్తూ ఆక్వా రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ‘అప్సడా’ చట్ట నిబంధనల ఉల్లంఘనపై కోర్టు ఫీడ్‌ కంపెనీలను ప్రశ్నించింది. అయితే అంతర్జాతీయ కారణాలతోనే ధరలు పెంచినట్లు కంపెనీలు కోర్టుకు తెలిపాయి. వాదనలు విన్న కోర్టు.. అక్టోబర్‌ 8లోపు మత్స్యశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించాలని ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕