ఏపీ ఇంటర్ బోర్డులో సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు

AP: ఇంటర్ బోర్డు 78వ పాలకవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇంటర్ బోర్డు సిబ్బంది పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆమోదం తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి భత్యాన్ని 25% పెంచాలని నిర్ణయించారు. పరీక్షల బుక్‌లెట్లలో పేజీల సంఖ్యను పెంచుతూ, అన్ని సబ్జెక్టులకు 32 పేజీల బుక్‌లెట్ అందించాలని, బోటనీ, జువాలజీ కలిపి 40 పేజీల బుక్‌లెట్ ఇవ్వాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్

✕
✕