ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. ఆగస్టు 13 వరకు నిందితులకు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు 12 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్, రాజ్ కసిరెడ్డి, పైలా దిలీప్, వెంకటేష్, బూనేటి చాణక్య, గోవిందప్ప, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్, ఎంపీ మిథున్ రెడ్డి, మరో ఇద్దరు నిందితులకు కోర్టు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.