AP: అంగన్‌వాడీ కేంద్రాల పాల ధర పెంపు

ఏపీలోని అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాల ధరను లీటరుకు రూ.9 మేర పెంచుతూ CM చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం లీటరుకు రూ.54.60 చెల్లిస్తుండగా, ఇకపై పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏడాదికి అదనంగా రూ.75 కోట్ల భారం పడనుంది. 55,547 కేంద్రాల్లోని సుమారు 23.50 లక్షల మందికి పౌష్టికాహారంలో భాగంగా ఈ పాలు అందుతాయి. దీనికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ఆర్థికశాఖ వద్ద ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕