ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలల్లో రాజకీయాలకు ఎంట్రీ లేదని స్పష్టం చేసింది. పాఠశాల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు తప్పించి ఏ ఇతర అనధికార వ్యక్తులను అనుమతించరాదని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీ గుర్తులు, వస్తువుల ప్రదర్శనను నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అనుమతి లేనిదే విద్యార్థులతో ఫొటోలు కూడా తీసుకోకూడది తెలిపింది.