ఎప్పటిలాగే ఉదయాన్నే పింఛన్ల పంపిణీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్‌దారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. బ్యాంక్ ఉద్యోగులు సమ్మె వాయిదా వేసుకోవడంతో, పింఛన్లను ఉదయాన్నే లబ్ధిదారుల ఇళ్ల వద్దే పంపిణీ చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. గతంలో సమ్మె నేపథ్యంలో మధ్యాహ్నం పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ, ఇప్పుడు ఎప్పటిలాగే ఉదయం 6:30 గంటల నుంచే పంపిణీ జరుగుతుంది. సెప్టెంబర్ 30న నగదు విత్‌డ్రా చేసుకుని, అక్టోబర్ 1న ఉదయం నుంచే లబ్ధిదారులకు అందజేస్తారు.

సంబంధిత పోస్ట్

✕
✕