AP: పింఛన్ల పంపిణీ విధానంలో నవంబర్ 1వ తేదీ నుంచి కీలక మార్పులు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్ వాటాను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి అందజేస్తారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అందించే వాటా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. దీనికోసం లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి. ఈ కొత్త విధానం పంపిణీలో పారదర్శకతను పెంచుతుందని, మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గిస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.4000 పింఛన్ వస్తుండగా, ఇందులో రాష్ట్ర వాటా రూ.3800, కేంద్ర వాటా రూ.200 ఉంది.