AP: బీసీలకు రూ.80వేలు 'సూర్య ఘర్‌' రాయితీ

AP: ప్రభుత్వం విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు ఇంటింటా సోలార్ పవర్ (జీరో విద్యుత్ బిల్లు) నినాదాన్ని అందుకుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి సూర్య ఘర్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకు కూడా సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. ముఖ్యంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీలకు రాయితీలు అందించేందుకు విద్యుత్‌శాఖ అధికారులు సర్వే ప్రారంభించి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సోలార్ కనెక్షన్ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

సంబంధిత పోస్ట్

✕
✕