బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఏపీ వాదనలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 33.33% రిజర్వేషన్లు కల్పించింది. అయితే, మొత్తం రిజర్వేషన్లు 49.24% మాత్రమే ఉన్నాయని, తాజా సర్వేలో బీసీల జనాభా 50.42 శాతంగా తేలిందని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. హైకోర్టు ఈ తాజా డేటాను పరిగణనలోకి తీసుకోలేదని, కాబట్టి హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక విచారణ జరపనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕