ఇంటర్ చదువుతున్న విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించడానికి షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి సెక్రటరీ కృతికా శుక్లా మంగళవారం విడుదల చేశారు. సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 10 వరకు ఫీజు చెల్లించుకోవచ్చని తెలిపారు. రూ.వెయ్యి ఫైన్‌తో అక్టోబర్ 11 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. ఇప్పటికే పాసైన వారు మళ్లీ రాసేందుకు రూ.1350(ఆర్ట్స్), రూ.1600(సైన్స్) చెల్లించాల్సి ఉంటుంది.