AP: రెండ్రోజుల పాటు షాపులు బంద్

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనున్నందున, ఈ రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఎన్నికల ప్రశాంతత, శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సాధారణ వైన్ షాపులతో పాటు క్లబ్‌లు, పబ్‌లు, బార్లు కూడా మూసి ఉంటాయి. మరోవైపు, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు అక్టోబర్ 18న ముగిసింది. అక్టోబర్ 19 నుంచి నామినేషన్ల పరిశీలన ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్

✕
✕