AP గతంలో గంజాయి హబ్‌గా పేరుపొందిందని.. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ గంజాయి దొరికినా, దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయని అప్పట్లో చెబుతుండేవారని హోం మంత్రి అనిత మీడియా సమావేశంలో తెలిపారు. అయితే గత ఏడాది నుంచి కూటమి ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల వల్ల రాష్ట్రంలో గంజాయిని నియంత్రించగలిగామని అన్నారు. గంజాయి నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రారంభించిన ‘ఈగల్’ పేరును సీఎం చంద్రబాబు స్వయంగా ప్రతిపాదించారని ఆమె పేర్కొన్నారు.