ఏపీలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఈ నెల 17 నుంచి 21 వరకు దరఖాస్తు పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. 25, 26 తేదీల్లో ప్రభుత్వం పింఛన్లను ఆమోదించనుంది. దరఖాస్తుదారుల సౌకర్యార్థం కేంద్రాల వద్ద ప్రత్యేక కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 62 లక్షల మంది పింఛన్ పొందుతున్నారు.