AP: రాష్ట్రవ్యాప్తంగా 243 సెకండరీ ఆస్పత్రులకు వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో 142 చోట్ల నియామకాలు పూర్తయ్యాయి. 7 CHCలు, 6 ఏరియా ఆస్పత్రుల్లో ముగ్గురు చొప్పున, 31 CHCలకు ఇద్దరు చొప్పున, మరో 13 ఏరియా ఆస్పత్రులకు, 3 జిల్లా ఆస్పత్రులకు ఇద్దరు చొప్పున స్పెషలిస్టులను నియమించారు. మిగిలిన 97 ఆస్పత్రులకు ఒక్కొక్క వైద్యుడిని కేటాయించారు. ఈ నియామకాలతో వైద్య సేవలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.