ఏపీలో శాశ్వత ప్రాతిపదికన 482 మంది వైద్యులకు నియామక ఉత్తర్వులు

ఏపీలో ప్రజారోగ్య శాఖ ద్వారా శాశ్వత ప్రాతిపదికన 482 మంది వైద్యులకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఉత్తర్వులు పొందిన అభ్యర్థులు 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని పేర్కొన్నారు. గత ఏడాది మెడికల్ ఆఫీసర్లు, ట్యూటర్ల పోస్టులకు (మొత్తం 636 ఖాళీల) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా సుమారు 5 వేల దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్