ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 163 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, డీఈఓ వంటి 13 రకాల కీలక సర్వీసుల్లో ఈ పోస్టులు ఉన్నాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు కమిషన్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలి.