అరకు కాఫీ షాపులు... మహిళలకు లోన్లు, సబ్సిడీలు

AP: రాష్ట్రంలో మహిళా సాధికారతను పెంచే లక్ష్యంతో, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నేటివ్ అరకు కాఫీ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఫ్రాంచైజ్ పద్ధతిలో అరకు కాఫీ దుకాణాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి జిల్లాలో రెండేళ్లలో రెండు దుకాణాలు స్థాపించనున్నారు. ఈ అరకు కాఫీ ఔట్‌లెట్లు ఏర్పాటు చేసుకునే మహిళలకు లోన్లు, సబ్సిడీలు అందించనున్నారు.

సంబంధిత పోస్ట్