AP: దేశంలో లోన్ యాప్స్ వేధింపులు తీవ్రమవుతున్నాయి. డాక్యుమెంట్లు లేకుండా తక్షణ రుణాలు ఇస్తామని ఆకర్షించి, డబ్బులు చెల్లించని వారిని ఏజెంట్లతో ఫోన్లు చేయించి వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో, వైజాగ్ పోలీసులు అలాంటి వేధింపులను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తక్షణ లోన్ యాప్‌ల మాయలో పడి జీవితాలను బలిచేసుకోవద్దని సూచిస్తున్నారు. లోన్ యాప్స్ పేరుతో వేధింపులకు పాల్పడితే బాధితులు 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.