పదోన్నతులు, డిప్యుటేషన్లపై ప్రభుత్వం నిషేధం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, కొత్త నియామకాలు, పదోన్నతులు, డిప్యుటేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. స్థానిక కేడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. రాష్ట్రపతి ఉత్తర్వు–2025 ప్రకారం 26 జిల్లాలకు స్థానిక కేడర్లను ఏర్పాటు చేయనున్నారు. మార్కాపురం, పోలవరం జిల్లాలకు తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయిస్తారు. రాష్ట్రాన్ని 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు, హైకోర్టు పోస్టులకు వర్తించవు.

సంబంధిత పోస్ట్