అమరావతిలో ఇంటిగ్రేటెడ్ సచివాలయ నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (PMC) నియామకం కోసం ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ గ్రీన్‌ఫీల్డ్ సిటీస్ లిమిటెడ్ (AGICL) టెండర్లను ఆహ్వానించింది. సుమారు రూ. 4,933 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో ఎంఈపీ, ఫసాడ్, ఇంటీరియర్స్, ఇతర అనుబంధ పనులు ఉంటాయి. జూన్ 30న టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్లు తెరుస్తారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయి.