గుంటూరు: ఏడాది సర్వీసు పూర్తయితే పదోన్నతి

గుంటూరు వైద్య కళాశాలలో సహాచార్యులుగా ఏడాది సర్వీసు పూర్తయిన వారి వివరాలు వెంటనే పంపించాల్సిందిగా రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. దీంతో అర్హులైన వారంతా సంబంధిత పత్రాలను వెంటనే అందజేయాల్సిందిగా ప్రిన్సిపల్ సూచించారు. ఈ సమాచారాన్ని మంగళవారం డీఎంఈ కార్యాలయానికి పంపనున్నారు. ఇందులో కొందరికి ఆచార్యులుగా పదోన్నతి ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్