జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడి యావత్ దేశాన్ని కదిలించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. జాతీయ భద్రత కోసం జనసేన ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు చేస్తున్నామని అన్నారు. సైనిక బలగాలకు ఆధ్యాత్మిక సంఘీభావం ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ శుక్రవారం ట్వీట్ చేశారు.