సమగ్ర శిక్ష పల్నాడు జిల్లా కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పోస్ట్ కు అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ గురువారం పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఎస్‌జీటీలు ఈనెల 7వ తేది నుంచి 26వరకు అధికారుల ద్వారా ధ్రువీకరించిన తమ దరఖాస్తులను డీఈఓ, సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలని స్పష్టం చేశారు.