ఏపీలో నిర్వహించిన మెగా డీఎస్సీపై దుష్ప్రచారం జరుగుతోందని శాప్ ఎండీ భరణి పేర్కొన్నారు. క్రీడల కోటాలో పోస్టుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, జూడో గురించి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. పోస్టులు రానివారి వద్దకు వెళ్లి కావాలనే ఆరోపణలు చేయిస్తున్నారని, జూడో కోటా ఎంపిక చేసినవారిపై పిటిషన్ వేశారని తెలిపారు. డీవోపీటీ చెప్పినదాన్నే అమలుచేశామని, ఎలాంటి మార్పులు చేయలేదని ఆమె వెల్లడించారు.