ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిక్షాటన నివారణ చట్టం 2025ను అధికారికంగా అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం, రాష్ట్రంలో భిక్షాటన చేసేవారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. రాష్ట్ర గవర్నర్ ఈ నెల 15న ఈ చట్టానికి ఆమోద ముద్ర వేయగా, ఈ నెల 27న జీవో జారీ అయింది. భిక్షాటన మాఫియాను అడ్డుకొని, నిరుపేదలకు పునరావాసం కల్పించడమే ఈ చట్టం లక్ష్యం.