AP: రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ప్రభుత్వం మరింత మెరుగైన బియ్యం పంపిణీ చేస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే 17 జిల్లాల్లో పంపిణీ మొదలైంది. వచ్చే నెలలో 20 జిల్లాలకు విస్తరించనుంది. 10 శాతం నూకలతో పంపిణీ చేసే బియ్యాన్ని క్యూఆర్ కోడ్‌తో ఉన్న బస్తాల్లో సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో 29,844 రేషన్ దుకాణాలు, 1.49 రేషన్ బియ్యం కార్డులు ఉన్నాయి. నెలకు 2.31 లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.