ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. ముందుగా అనుకున్న జూలై 5వ తేదీకి బదులుగా, మారిన షెడ్యూల్ ప్రకారం జూలై మూడో వారంలో ఈ విమానాశ్రయం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ జూలై 25 నాటికి మొదలవుతాయని తెలుస్తోంది.