త్వరలో ఏపీకి బుల్లెట్‌ రైలు: BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌

AP: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సోమవారం నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుందని ఏపీ  BJP రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు. రైల్వే జోన్‌ సాధన కోసం BJP మూడు దశాబ్దాలుగా పోరాటం చేసిందని, రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశాన్ని చేర్చడంలో పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. అలాగే విశాఖపట్నం కేంద్రంగా బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమవుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించినట్లు మాధవ్‌ చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్