29 నుంచి విజయవాడలో బిజినెస్ ఎక్స్‌పో

AP: రాష్ట్రంలో అపార వ్యాపార అవకాశాలను ప్రచారం చేయాలనే లక్ష్యంతో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు బిజినెస్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్‌లో బిజినెస్ ఎక్స్‌పో నిర్వహిస్తున్నామని, 160 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్స్‌పో రోజూ మూడు రంగాలపై నిపుణులతో ఉచితంగా సెమినార్లు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్