AP: రాష్ట్రంలో మద్యం అమ్మకాలను పెంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోవా తరహాలో బీచ్‌లలో మద్యం సేవించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సూర్యలంక, విశాఖ బీచ్‌లలో పైలట్ ప్రాజెక్టుగా బీచ్ షాక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ బీచ్ షాక్స్ అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో అన్ని బీచ్‌లలోనూ వీటిని విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది.