AP: కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా పెంచాలనే నేపథ్యంలో మూడో బిడ్డ పుట్టిన తల్లికి నగదు ప్రోత్సాహకం అందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే నాలుగో బిడ్డ పుడితే కూడా ఆస్తి పన్ను మినహాయింపు లాంటి అనేక ప్రోత్సాహకాలను కొనసాగించాలని యోచిస్తోంది. అంతేకాకుండా కొంతమందికి పిల్లలు పుట్టడంలో సమస్యలు ఉంటాయి. అలాంటి కుటుంబాల కోసం ప్రభుత్వమే ముందుకు వస్తోంది. ఐవీఎఫ్ చికిత్సకు అవసరమైన ఈ ఖర్చులో కనీసం కొంత భాగాన్ని ప్రభుత్వమే భరించాలని చూస్తోంది.