AP: సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. 2012 బ్యాచ్‌కు చెందిన కౌశల్ రెండు రాష్ట్రాల్లో సేవలందించారు. ఇటీవలే వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం ఆయన రాజీనామాను అధికారికంగా ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.