ఈ నెల 29న నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, పవన్ పర్యటన

AP: రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కోసం రూ. 10,000 కోట్ల బడ్జెట్‌తో 'పల్లె పండుగ 3.0' కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ నెల 29న నెల్లూరు జిల్లా రామాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతుల మెరుగుదలకు ఈ నిధులు కేటాయించారు. అధికారులు, కూటమి నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్

✕
✕