ద‌స‌రాకు గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న చంద్ర‌బాబు?

టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు దసరా కానుకను ఇవ్వ‌నున్న‌ట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్న‌ట్లు స‌మాచారం. మహిళలకు దసరా కానుకగా ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే వరాన్ని బాబు ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అదే విధంగా రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే పథ‌కంపై కూడా కీల‌క నిర్ణయం వెలువ‌డే అవ‌కాశం ఉంద‌ని స‌మాచాం.

సంబంధిత పోస్ట్