ఏపీలో వాలంటీర్ల సేవల కొనసాగింపుపైన ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. జగన్ హయాంలో నియమితులైన వాలంటీర్లకు నాలుగు నెలలుగా జీతాలు లేవు. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు, సచివాలయాల నిర్వహణలో మార్పుపైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఈ సమయంలోనే వాలంటీర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు.