నేడు ‘పల్లె పండగ 3.0’ను ప్రారంభించనున్న చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘పల్లె పండగ 3.0’ కార్యక్రమం నేడు (మంగళవారం) నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. వరికుంటపాడు మండలం రామాపురంలో మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా రూ.11,085 కోట్ల అంచనా వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. గ్రామీణ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధితోపాటు పాడి రైతులకు ప్రోత్సాహం కల్పించే పనులు చేపట్టనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕