AP: రాష్ట్రంలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై మద్యం బాటిళ్ల పరిమాణంలో మార్పులు చేయనున్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఉన్న 90, 180, 375, 750 ఎంఎల్ బాటిళ్లతో పాటు, ఇకపై 150, 200 ఎంఎల్ పరిమాణంలో కొత్త సీసాలు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అలాగే, రాష్ట్రంలోని మద్యం షాపులు, బార్ల వద్ద బ్రాండ్ బోర్డులు, హోర్డింగులు, ఫ్లెక్సీల ఏర్పాటును కూడా నిషేధించారు.