తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్

తిరుపతి స్విమ్స్ ఆధ్వర్యంలో ఎర్రావారిపాళెం మండలంలోని నెరబైలు, యల్లమంద పీహెచ్‌సీల్లో గురువారం ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో క్యాన్సర్ లక్షణాలు, నివారణపై అవగాహన కల్పించారు. బీపీ, షుగర్ పరీక్షలతోపాటు, పింక్ బస్సులో నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లకు పరీక్షలు నిర్వహించారు. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్